Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
దేశవ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ 2021 ఫలితాలలో రెజొనెన్స్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి తమ ఆధిక్యాన్ని చాటుకున్నారని డైరెక్టర్స్ ఆర్.వి. నాగేంద్రకుమార్, కొందా శ్రీధర్ రావు తెలిపారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి, రెజొనెన్స్ విజయపరంపరను కొనసాగించారని. దేశంలో పోటీ పరీక్ష ఏదైనా రెజొనెన్స్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో రెజొనెన్స్ కళాశాల కీర్తిని దేశం నలుదిశాల వ్యాపింపజేస్తున్నారు. డి. యశ్వంత్ అఖిల్-121, పి. చందన మౌర్య-644, బి. వరుణ్-2726, విజరు కుమార్ -3802 వంటి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. విద్యార్థులను, అభినందిస్తూ పరీక్షా విధానంలో ఎన్ని మార్పులు చేసినప్పటికీ దానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఇటువంటి అద్భుత విజయాలను సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ సతీష్ , బానర్రెడ్డి, రాంబాబు పాల్గొన్నారు.