Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా టౌన్
కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రాను బర్తరఫ్ చేయాలని, శాంతియుత, ప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతున్న రైతు ఉద్యమాలపై జరుగుతున్న భౌతిక దాడులను నిరసిస్తూ శనివారం వైరా మండలంలో రైతులు ప్రదర్శన నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ రైతులపై కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారు నడిపి రైతులను హత్య చేయడం, రైతుల మృతికి కారణమైన కేంద్ర మంత్రి అజరు మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయకపోవడంతో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు శనివారం వైరా పట్టణం, గోల్లెనపాడు గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేసిన అనంతరం దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరావు, సుంకర సుధాకర్, రైతు సంఘం మండల కార్యదర్శి నల్లమోతు వెంకటనారాయణ, కిలారు శ్రీనివాసరావు పైడిపల్లి సాంబశివరావు, సంక్రాంతి నర్సయ్య, బండారుపల్లి వెంకటయ్య, ఇల్లందుల వెంకట్, మల్లెంపాటి ప్రసాదరావు, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మెహనరావు, సత్యనారాయణ, చండ్ర ప్రసాద్, వెంపటి రాజా, ఆళ్ళ శ్రీనివాస్, దూళ్ళిపాల రవి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.