Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటి కళాశాలలలో ప్రవేశానికై ఈ నెల 3న నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్ పరీక్షలో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి, శుక్రవారం ప్రకటించిన జె.ఇ.ఇ. అడ్వాన్స్ ఫలితాలలో హార్వెస్ట్ కళాశాల విద్యార్థులు విజయకేతనాన్ని ఎగురవేశారని హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ రవిమారుత్, ప్రిన్సిపల్ పార్వతీరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కళాశాల నుంచి 28 మంది అడ్వాన్స్ పరీక్ష రాయగా 10 మంది విద్యార్థులు ఐ.ఐ.టి కళాశాలలలో ప్రవేశానికి అర్హత సాధించారని తెలిపారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను అభినందించారు. తమ విద్యార్థులు మేడూరి హర్షిత్ చౌదరి 49/585, విశాల్ మ్యాథ్యూస్ 140, ఎస్. కార్తిక్ 456, వి.నిహంత్ 569, టి. ప్రణరు 2410, యు. గిరిధర్ 2574, నారాయణ రావు 3261, కార్తికేయ 4637 ర్యాంకులతో విజయ దుంధుభి మ్రోగించి జిల్లా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ దసరా తమ విద్యాసంస్థలు తిరుగులేని విజయంతో ఉత్సాహాన్ని నింపాయని, ర్యాంకులు సాధించిన తమ విద్యార్థులందరూ ఎల్.కె.జి నుండి, 6వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ఇక్కడే తయారైన మెరికలన్నారు. ఒక క్రమమైన పద్ధతిలో విద్యను అందించడం, ప్రోత్సహించడం, విద్యార్థులు ఆచరించేవిధంగా చూడడం, తమ అభిమతమన్నారు. విద్యార్థులను అధ్యాపకులు అభినందించారు.