Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
కరోనా మహమ్మారి విజృంభన సమయంలో గ్రామంలో కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రజలకు సేవ చేసిన సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, ఆళ్లపాడు సర్పంచ్ మర్రి తిరుపతిరావు, పంచాయతీ సిబ్బందికి, ఆశావర్కర్లకు గ్రామస్తులు సోమవారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. జిల్లా ఓబీసీ నాయకులు జంపాల రవి, మండల బీజేవైఎం అధ్యక్షులు కాలసాని పరశురామ, మండల బీజేపీ నాయకులు మరీదు పరశురాముడు, దొంతబోయిన వెంకట్రావు, చిన్నకేసీ ఐతంరాజు, తమ్మారపు లక్ష్మయ్య శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి, కరోనా కట్టడికి గాను సర్పంచ్ మర్రి తిరుపతిరావు చేసిన కృషికి జాతీయ కీర్తి పురస్కార అవార్డ్ అందుకున్నారు. కరోన సమయంలో పంచాయతీ సిబ్బంది కషి ని అభినందించారు. కరోనా విజృంభన సమయంలో ప్రజలకు కరోనా టెస్టులలోను, వ్యాక్సిన్ విషయంలో, పారిశుద్ధ్య పనులు, శానిటేషన్ చేయిస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తూ కట్టడికి కృషిచేసిన సర్పంచ్ మర్రి తిరుపతిరావు పంచాయతీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ అభివృద్దే లక్ష్యంగా సర్పంచ్ పని చేస్తున్నారన్నారు. జిల్లా పరిషత్ పాఠశాల పారా లక్మి నారాయణ సారధ్యంలో కూరకుల నాగభూషణం నిధుల సహకారంతో బడి నిర్మాణం జరిగిందన్నారు. మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశావర్కర్లు కృషిని, సేవను గుర్తించి మాకు లభించిన ఈ సత్కారం వలన మాకు మరింత బలాన్ని చేకూరిందన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చెయ్యటానికి ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలు ఉంటే గ్రామ రాజకీయాల్లో స్నేహపూరిత విధానం నెలకొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది బలగాని నాగరాజు, అర్వపల్లి తిరుపతి, పిచ్చయ్య, దానయ్య, ఆశావర్కర్లు కళావతి, వైస్ ప్రెసిడెంట్ మల్లాది గంగమ్మ, విద్యా కమిటీ చైర్మన్ బండి పుల్లయ్య, సిపిఎం గ్రామ కార్యదర్శి బండి నాగేశ్వరరావు, బుంగ ఆంజనేయులు, అంగడాల పిచ్చమ్మ, దొంతిబోయిన సురేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.