Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కాపా మురళీ కృష్ణ
నవతెలంగాణ-వైరా
వైద్య శాస్త్రంలో ఎన్నెన్నో అద్భుతాలు ఆవిష్కరించబడుతున్న, అద్భుతాల దృష్టికి అనస్థీషియా కీలకమని డాక్టర్ కాపా మురళీ కృష్ణ అన్నారు. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ శస్త్ర చికిత్సలతో పునర్జన్మనిస్తున్నారు. అవయవాల మార్పిడితో ప్రాణాలు నిలుపు తున్నారు. రోగికి నొప్పి తెలియకుండా అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ లు చేయటం వైద్య శాస్త్రంలో ఓ అద్భుతమే అన్నారు. పూర్వం రోజుల్లో అశాస్త్రీయ పద్ధతుల్లో మత్తు విధానం ఉండేదని, అందువలన శస్త్ర చికిత్సలు తక్కువ శాతం విజయవంతం అయ్యేవని అన్నారు. ఒక వేళ ఆపరేషన్ విజయవంతం అయినా రోగి కోలుకోవడంలో ఎన్నో సమస్యలు వచ్చేవని ఆ పరిస్థితుల్లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో '' మసెచ్యూసెట్'' ఆసుపత్రిలో 1846 అక్టోబర్ 16 న డబ్ల్యూ టీజీ మోర్టాన్ అను డాక్టర్ గిల్బర్ట్ అబొట్ అను రోగిపై ఈథర్ వాయువును ప్రయోగించారు. ఈ పరిణామం వైద్య శాస్త్రంలో అద్భుతం ఆవిష్కరించబడటమే గాక, మత్తు వైద్య విభాగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఆ తరువాత పలు రకాల మత్తు ఔషధాలు, పరికరాలు వచ్చాయని, పలు రకాల నూతన శాస్త్రీయ మత్తు విధానాలు అవలంభించడం ద్వారా వైద్య శాస్త్రంలో మత్తు విభాగం ప్రాముఖ్యత విస్తరించి కీలకంగా మారిందని డాక్టర్ మురళి కృష్ణ అన్నారు. నొప్పులను తగ్గించే పెయిన్ క్లీనిక్లు, నొప్పి అనేది శరీరంలో జరిగే అసాధారణ చర్యలను సూచించే ఒక లక్షణం అని, నొప్పిని రెండు భాగాలని ఒకటి తీవ్రమైనది.
రెండవది దీర్ఘ కాలిక నొప్పి
దీర్ఘకాలిక నొప్పి వ్యవది మూడు నెలలకు పైగా ఉంటుందని, దీనివలన శరీరం భావోద్రేక, ఇంద్రియ, హార్మోనల్ అసమతుల్యతకు లోనై మాంద్యము, మందులకు స్పందించక పోవటం, నిద్రలేమి వంటి వాటితో జీవన నాణ్యత తగ్గిపోతుందని అన్నారు. ఇలాంటి దీర్ఘ కాలిక నొప్పులకు చికిత్స చేయటానికి పెయిన్ క్లినిక్స్ అందుబాటులోకి వచ్చాయని, వాటిలో ఆధునిక పరికరాలు ( ఎక్స్ రే మిషన్, సిటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మిషన్ లను ఉపయోగించి కుట్లులేని ప్రత్యేక మైన ఇంజెక్షన్ ల ద్వారా నొప్పి తగ్గిస్తారని డాక్టర్ మురళి కృష్ణ వివరించారు. మోకాలు, మెడ, తల, క్యాన్సర్, నొప్పులకు చికిత్స చేసి నొప్పి తగ్గిస్తారని, కాన్పుల నొప్పులకు లేబర్ అనస్థీషియా పద్ధతిలో నొప్పి లేకుండా చేస్తారని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో సంవత్సరానికి 40-50 వేల ఆపరేషన్ లు నిర్వహించడంలో అనస్థీషియా విభాగం వైద్యులే కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. అనస్థీషియా అంటే స్పెషలైజేషన్ కోర్స్ అని,ఎbbర తరువాత పీజీ కోర్స్ అని చాలా మందికి తెలియదని, ఇన్ని రకాల సేవలు అందిస్తున్నా మత్తు డాక్టర్లకు ప్రజల్లో అంతగా గుర్తింపు ఉండదని, అందుకే ఇన్నేళ్లుగా తెర వెనక వీరులుగా గుర్తించ బడ్డారని అన్నారు. ప్రపంచ అనస్థీషియా డే సందర్భంగా అన్ని మెడికల్ కాలేజీల్లో అనస్థీషియా డాక్టర్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారని, డిపార్ట్ మెంట్ ఆఫ్ అనస్థీషియా క్రిటికల్ కేర్ అండ్ మెడిసిన్ ఆధ్వర్యం లో ఖమ్మం మమత వైద్యశాలలో శనివారం అనస్థీషియా డే నిర్వహించి నట్లు తెలిపారు.