Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-రఘునాధపాలెం
టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా పని చేయాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. మండల కేంద్రమైన గణేష్ గార్డెన్స్ నందు ఖమ్మం నియోజకవర్గం, రఘునాధపాలెం మండల స్థాయి తెరాస పార్టీ సమావేశానికి ముఖ్య అతిధిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ హాజరై మండలంలోని అన్ని గ్రామాల కమిటీలను ప్రకటించారు. ఆయా పార్టీ ప్రతినిధులు తమ తమ గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీ పటిష్టత కోసం, పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం పేదల సంకేమార్థం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లేలా పని చేయాలన్నారు. అనంతరం ఎస్టి సెల్ మండల అధ్యక్షునిగా కంపాటి రవికుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎంపీపీ భూక్యా గౌరీ, జడ్పిటిసి మాలోతు ప్రియాంక, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మండల కార్యకర్తలు పాల్గొన్నారు.