Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాటల సీడీ ఆవిష్కరణ
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లా ప్రధాన ఆస్పత్రి ఏవో డాక్టర్ కె రాజశేఖర్ గౌడ్ని జిల్లా మంత్రి పువ్వాడ అజరు శనివారం ప్రత్యేకంగా అభినంది ంచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబందు, రైతు బంధు తదితర పథకాలపై డాక్టర్ రాజశేఖర్ గౌడ్, కూర్పు సౌజన్యంతో రూపొందించిన పాటల సీడీని ఖమ్మంలో తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒకవైపు వైద్యుడికిగా మరోవైపు జిల్లా ఆస్పత్రి ఏవో బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం చేపట్టిన పథకాలపై పాటల రూపంలో ప్రజలకు తెలియజేసేందుకు రాజశేఖర్ గౌడ్ చేస్తున్న కృషి మరువలేనిదిన్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాజశేఖర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని కొనియాడారు. ప్రధానంగా గ్రీన్ చాలెంజ్ ద్వారా మొక్కలు నాటడం చాలా గొప్పవిషయమన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ నీరజ, టీిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇంచార్జ్ ఆర్జెసి కృష్ణ, మున్సిపల్ కార్పొరేటర్లు తోట వీరభద్రం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్ పాల్గొన్నారు.