Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమిపూజ నిర్వహించిన మున్నూరుకాపు సంఘం
నవతెలంగాణ- సత్తుపల్లి
దక్షిణ భారతదేశాన్ని పాలించిన సూపర్ లెజెండ్ శ్రీకృష్ణదేవ రాయ కాంస్య విగ్రహ ఏర్పాటుకు సత్తుపల్లి పట్టణ మున్నూరుకాపు సంఘం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రముఖుల విగ్రహాల సముదాయం పక్కన శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శుక్రవారం సంఘ నాయకులు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంఘ మున్నూరుకాపు నాయకులు మాట్లాడారు. కాపు/బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీకృష్ణదేవరాయల పాలనలో ప్రజలు సర్వతో ముఖాభివృద్ధితో తులతూగారని, కరువు కాటకాలు రాకుండా ఆయన పాలన సాగిందన్నారు. వజ్రాలు, బంగారం, ముత్యాలు వీధుల్లో రాశులుగా పోసి అమ్మిన కృష్ణదేవరాయ పాలనను కొనియాడారు. ఈ నేపధ్యంలో ఆయనను స్మరించుకునేందుకు సత్తుపల్లిలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘ నియోజకవర్గ కన్వీనర్ మానుకోట సత్యనారాయణ (మధు), మున్సిపల్ వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, పట్టణ కన్వీనర్ రామిశెట్టి కృష్ణ, మండల కాపుసంఘం అధ్యక్షులు తోట గణేశ్‌బాబు, ఉపాధ్యక్షులు భీమిశెట్టి రాము, నాయకులు చీనేని బాలకృష్ణ, రామిశెట్టి లక్ష్మణరావు, తోట కిరణ్, పెద్దిరెడ్డి పురుషోత్తం, చిన్నంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో విగ్రహాన్ని ప్రతిష్టించడం జరుగుతుందని సంఘ నాయకులు తెలిపారు.