Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డాక్టర్ చీకటి భారవి, బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరా టౌన్
వ్యవసాయం రైతుల చేతుల్లో ఉంటేనే భారతదేశ ప్రజలకు ఆహారం, ఆరోగ్యం అందుబాటులో ఉంటాయని, కార్పొరేట్ వ్యవసాయ విధానం అమలు చేస్తే కోట్ల మంది ప్రజలకు ఆహారం లభించటం కష్టం అవుతుందని, సరైన ఆహారం లభించని చోటా ఇంకా వైద్యం గురించి ప్రజలు మరిచిపోవాలని ప్రముఖ ప్రజా వైద్యులు చీకటి భారవి, బోడేపూడి కళానిలయం సంస్థ కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఆదివారం వైరా సిపిఐ(ఎం) కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ప్రతి నెల ముడోవ ఆదివారం జరిగే వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లఖింపూర్, ఢిల్లీ రైతు ఉద్యమ అమరులకు, వైద్య శిబిరం నిర్వాహకులు, రైతు సంఘం సీనియర్ నాయకులు నర్వనేని సత్యనారాయణకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డాక్టర్ చీకటి భారవి, బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జట్లా రంగారావు, డాక్టర్ పిల్లులమరి సుబ్బారావు, వైద్య శిబిరం బాధ్యులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు గుడిమెట్ల రజిత, మాదినేని రజనీ, గుడిమెట్ల మెహనరావు, మల్లెంపాటి ప్రసాదరావు పాల్గొన్నారు.