Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాధపాలెం
మానవ శరీరానికి మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంచి ఆరోగ్యవంతులు చేసే క్రీడలలో యువత రాణించాలని, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల, నాగరాజు, డీవైయఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ లు పిలుపునిచ్చారు. దసరా పండగను పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక చిమ్మపుడి హై స్కూల్లో ఉత్సాహపూరితంగా, విజయవంతంగా డీవైయఫ్ఐ, యస్యఫ్ఐ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ... నేడు సమాజంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ యువత చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని, టెక్నాలజీ పరంగా అభివృద్ధి అవుతూనే, సమాజ శ్రేయస్సుకి అభివృద్ధికి పాటుపడాలని వారు అన్నారు. కానీ నేటి యువత మత్తుపానియలకు గురవుతున్నారని, ఫలితంగా క్రీడల పట్ల ఆసక్తి తగ్గి మానసిక, శారీరక ఉల్లాసాన్ని కోల్పోతున్నారని, అనారోగ్య పాలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడా యువతకు ఉపాధి చూపించకుండా మద్యాన్ని పెంచిపోసిస్తున్నాయని, యువత ఆలోచనలను ప్రక్కదారి పట్టిస్తున్నాయని వారు తెలిపారు. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాలు ఉద్యమాలతో పాటు క్రీడలు పెట్టడం అభినందనీయం అన్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ కి ప్రధమ బహుమతి ఇచ్చిన కొట్టెముక్కుల.ఉపేందర్(స్టీవ), ద్వితీయ బహుమతి ఇచ్చిన మెడబోయిన. నగేష్ లను నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్యఫ్ఐ జిల్లా కార్యదర్శి జెమ్మి అశోక్, చిమ్మపుడి, కోటపాడు గ్రామ సర్పంచ్ లు, గొర్రె, కృష్ణవేణి, బాతుల సుధాకర్ రమణ, చిమ్మపుడి గ్రామ ఉప సర్పంచ్ గుత్తా వెంకటేశ్వర్లు, చిమ్మపుడి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కొటేరు, నర్సిరెడ్డి, యలమరెడ్డి, వెంకట్ రెడ్డి, చిమ్మపుడి గ్రామ వార్డు సభ్యులు కాలంగి, వీరబాబు పాల్గొన్నారు.