Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సంస్థ నేషనల్ మార్కెటింగ్
అ హెడ్ చైతన్య ధారేశ్వర్
అ ఖమ్మంలో ఘనంగా కంపెనీ డీలర్ల సమావేశం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
పంటల సస్యరక్షణే ధ్యేయంగా 1985లో స్థాపించిన ప్రముఖ పురుగుమందుల సంస్థ జీఎస్పీ క్రాప్ సైన్స్ ప్రయివేటు లిమిటెడ్ ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో తమ బ్రాంచీలను కలిగి ఉందని సంస్థ నేషనల్ మార్కెటింగ్ హెడ్ చైతన్య ధారేశ్వర్ పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర కమర్షియల్, కార్పొరేషన్ సంస్థ అధినేత రామడుగు మనోహర్ రావు, జీఎప్పీ క్రాప్ సైన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జీఎస్పీ క్రాప్ సైన్స్ కంపెనీ డీలర్ల సమావేశం ఆదివారం ఖమ్మంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ధారేశ్వర్ మాట్లాడుతూ ప్రపంచంలో వ్యవసాయం చేసే 85 దేశాల్లో ఏకంగా 60 దేశాలకు జీఎస్పీ సైన్స్ సంస్థ ఉత్పత్తులు (క్రిమిసంహారక మందులు) ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా చైనా, అమెరికా, యూరప్ దేశాల్లోనూ తమ సంస్థ పురుగుమందులను ఎగుమతి చేస్తోందన్నారు. దేశీయంగా సొంత పరిశ్రమను కలిగిఉండి పురుగుమందుల తయారీలో అత్యంత అధునాతన సాంకేతికతను మేళవించి ప్రపంచంలో మరే సంస్థ కూడా పోటీపడలేనంతగా నాణ్యత, నమ్మకంగా రైతులకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రతీ సంవత్సరం సరికొత్త ఆవిష్కరణలతో కంపెనీ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉత్తమమైన పురుగుమందులు తయారు చేస్తున్నామని తెలిపారు. తమ సంస్థ జీఎప్పీ క్రాప్ సైన్స్ దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రశంసలు అందుకున్నదని అన్నారు. సొంతంగా రీసెర్చ్, డెవలప్మెంట్ ప్లాంట్లలో ప్రపంచ స్థాయి సాంకేతికతను వినియోగించి పురుగుమందులు తయారుచేస్తూ అనేక రకాల పేటెంట్ హక్కులు కలిగి ఉన్న సంస్థ జీఎప్పీ క్రాప్ సైన్స్ మాత్రమేనని అన్నారు. మాలిక్యూల్స్‌ను సొంతంగా తయారు చేసే సామర్థ్యం ఉండటంతోనే మిగతా కంపెనీలు ఇవ్వలేని విధంగా నాణ్యత, రైతులకు అందుబాటులో ఉండేలా ధరల్లో తమ ఉత్పత్తులు లభిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పలువురు డీలర్లకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సమావేశానికి సంస్థ సౌత్ ఇండియా జనరల్ మేనేజర్ బీఆర్ఎల్ మోహన్ రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా అథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ రామడుగు మనోహర్ రావు, ఏరియా మేనేజర్ ఎన్ఎల్ ప్రసాద్ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఉన్నం రవి, కమల్ శ్రీనివాస్, రైతుమిత్ర సుధాకర్, పలువురు డీలర్లు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.