Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కోటమైసమ్మ తల్లి దర్శనానికి బారులు
నవతెలంగాణ-కారేపల్లి
కోటమైసమ్మ తల్లిజాతర జోరు తగ్గలేదు. మూడోరోజు ఆదివారం కూడా జాతరకు వేలాది మంది జనం తరలి వచ్చారు. వర్షపు జల్లులతో జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాలు, వినోద సాధనాలు వారు ఇబ్బందులు పడ్డారు. జాతర ఎక్కువగా జరిగే రాత్రి సమయాల్లో వర్షం వస్తుండటం షాపులు ఏర్పాటు చేసుకున్న వారు ఇబ్బందులతో పాటు ఆదాయంకు కొంత గండి పడింది. జాతరలో ఈ సారి చిన్నారులకు బోటింగ్, డాన్సింగ్ డాల్, రౌండ్ హెలికాప్టర్ వంటి వాటినికి ఏర్పాటు చేశారు. వాటిలో చిన్నారులు కేరింతలు కొడుతుంటుంటే తల్లిదండ్రులు అనందపడ్డారు. స్ధానిక ప్రజాప్రతినిధులు అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఎంపీపీ మాలోత్ శకుంతల-కిషోర్ దంపతులు, జడ్పీటీసీ వాంకుడోత్ జగన్-జమున దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతర నాల్గోవ రోజు సోమవారం ఆలయం హుండీల లెక్కింపు జరుగుతుందని ఆలయ ట్రస్టీ చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభి రామారావు, ఈవో అద్దంకి నాగేశ్వరరావు లు తెలిపారు. జాతరలో సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై పీ.సురేష్ ఆధ్వర్యంలో బంద్ బస్తు నిర్వహించారు. జాతరలో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా డాక్టర్ నెల్లూరి చందన, పీహెెచ్ఎన్ సుధారాణిలు సందర్శించారు.