Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
ఖమ్మం జిల్లా స్థాయి షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో మధిర మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన ఎ.ఆర్.సమీర్ దర్శకత్వంలో శోభన్ భోగరాజుప్రధానపాత్ర లో రూపుదిద్దుకున్న రైతు ఆత్మకథ చిత్రం
టాప్ టెన్ ఉత్తమ చిత్రాలలో ఎంపికైంది. ఈ సందర్భంలో మొగిలి గుణకర్, శ్రీ మిత్రా గ్రూపు, శ్రీ అభయ హాస్పిటల్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఖమ్మం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడినది. ఈ సందర్భంలో జబర్దస్త్ రాజమౌళి చేతుల మీదుగా ఎ.ఆర్.సమీర్ ప్రశంసా పత్రాన్ని రైతు ఆత్మకథ టీంకు అందజేశారు. సమీర్ టీమ్ కు పలువురు అభినందనలు తెలియజేశారు.