Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని తీగల బంజర గ్రామానికి చెందిన శ్రీ విజయావిలాసిని రియల్ ఎస్టేట్ అధినేత కుంచెపు రాంబాబు తండ్రి కుంచపు వెంకటయ్య జ్ఞాపకార్దం మినీ వాటర్ ప్లాంట్‌కి అయ్యే ఖర్చును ఆదివారం గ్రామ సర్పంచ్ షేక్ అబ్జల్ బీ గ్రామస్తులకి అందజేశారు. ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నిర్మించేందుకు సర్పంచ్ షేక్ అబ్జల్ బీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరు సహకరించాలని కోరారు. ఐదులక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన రాంబాబును గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా నాయకులు, సిపిఎం నాయకులు షేక్ దాదాసాహెబ్, షేక్ సైదా, కట్టా రాంబాబు, మీటు, షేక్ ఖాదర్ బాబు, ఆలకుంట సైదులు, సయ్యద్ సోందు, నునావత్ శ్రీను, నునావత్ నరసింహ, సత్తెనపల్లి క్రిష్ణయ్య, చంద్రు, భద్రు, షేక్ బుజ్జా, షేక్ నాగుల్ మీరా, వాగ్య,భద్రు, పోలంపల్లి వెంకటేశ్వర్లు,వార్డ్ మెంబర్లు దొడ్డపనేని బాబు, ముత్యాల బాస్కర్ రావు, చందులాల్, అనూష,ఉప సర్పంచ్ పద్మ, దేవ్లా, దరావత్ సైదులు, భూక్య నాగేశ్వరరావు, నాగు,వీరు, మాజీ సర్పంచ్ నునావత్ లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.