Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ముదిగొండ మండలం కమలాపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తుల అకాల దుర్మరణానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ చట్టు స్వామిపై ములకలపల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినిమజ్జనంలో అపశృతి
ఇద్దరు మృతి
కల్లూరు : అప్పటి వరకు తమతో ఆడుతూ పాడుతూ దుర్గమ్మను ఎత్తుకుని నిమజ్జనం చేస్తుండగా అర్దరాత్రి వేళ ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందటంతో వేడుకులు కాస్త విషాదఛాయలుగా మారాయి. మండల పరిధిలోని రఘునాథ్ బంజర గ్రామంలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గాదేవి ప్రతిమను నిమజ్జనం చేసేందుకు గ్రామస్థులందరూ ఆటాపాటలతో గ్రామం మొత్తం ఊరేగింపు చేసి మదిర బ్రాంచి కాల్వలో శనివారం అర్ధరాత్రి సమయంలో నిమజ్జనం చేస్తుండగా కాలుజారి వివాహిత శ్రీ గంధం మధులత(26) కాల్వలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు అదే గ్రామానికి చెందిన పసుపులేటి శివ(23) కాల్వలోకి దూకాడు. అతను కూడా గల్లంతయ్యాడు. వీరిని కాపాడేందుకు మరో నలుగురు కాల్వలో దూకి గాలింపు చేయగా వరద ప్రవాహానికి తట్టుకోలేకపోయారు. దీంతో ఒడ్డునున్న వారు చీరలు, టవల్స్ అందించి ఆ నలుగురిని లాగటంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. గంట తర్వాత మధులత శవమై బయటికి తేలగా గల్లంతైన పసుపులేటి శివ ఆదివారం ఉదయం కిలోమీటర్ దూరంలో శవమై పైకి తేలి కన్పించాడు. మధులత పెనుబల్లి మండలం బసవన్నపాలెం గ్రామానికి చెందిన రాధాకృష్ణతో వివాహమైంది. వీరికి రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. దసరా పండక్కి రఘునాథ్ బంజరు గ్రామం పుట్టింటికి వచ్చి వేడుకల్లో పాల్గొనగా ఈ విషాదం చోటుచేసుకుంది. పసుపులేటి రామయ్య- ధనమ్మ దంపతులకు శివ ఏకైక కుమారుడు. హైదరాబాద్లో మేనమామ వద్ద వ్యాపారం చేస్తున్నాడు. పండక్కి ఇంటికొచ్చి నిమజ్జనం వేడుకల్లో ప్రాణాలు కోల్పోవడంతో ఆ దంపతులు రోదన వర్ణనాతీతంగా మారింది. ఇద్దరు మృతి చెందడంతో ఆ గ్రామం మొత్తం విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏసీపి, సీఐలు సందర్శన
రఘునాథ్ బంజర గ్రామాల్లో దుర్గాదేవి ప్రతిమ నిమజ్జనం సందర్భంగా కాలుజారి ఇద్దరు మృతి చెందటంతో ఆదివారం ఆ గ్రామానికి కల్లూరు ఏసీపీ ఎన్. వెంకటేష్ ,పెనుబల్లి రూరల్ సీఐ కరుణాకర్ గ్రామంలో సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సీఐ ఆధ్వర్యంలో ఎస్ఐ ఎండీ రఫి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బాధిత కుటుంబాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ పరామర్శ
రఘునాదబంజర గ్రామంలో కాలువలో పడిపోయి మృతి చెందిన విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ కట్టా అజరుకుమార్, ఎంపీపీ బీరవలీ రఘు ఆదివారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. అధికారులతో మాట్లాడి పంచనామాలు త్వరగా పూర్తిచేసేందుకు కృషి చేసారు. వారి వెంట ఆ గ్రామ సర్పంచ్ కుక్క అర్జునరావు, ఉప సర్పంచ్ చల్లగుండ్ల వేంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు పడకంటి రామకృష్ణ ఉన్నారు.నట్లు ఎస్ఐ టీ నరేష్ ఆదివారం తెలిపారు.