Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వైరా టౌన్
సీఐటియు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ వైరా పట్టణ నాయకులు గుర్రాల రామిరెడ్డి ఆదివారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గుర్రాల రామిరెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు సందర్శించి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వీరితోపాటు సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, షేక్ జమాల్ సాహెబ్, వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు, రూరల్ కన్వీనర్ తోట నాగేశ్వరరావు, ఐద్వా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మెహనరావు తదితరులు నివాళులు అర్పించారు.
బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నివాళి
సీఐటియు అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకుడు గుర్రాల రామిరెడ్డి మృతదేహాన్నిబిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సందర్శించి పూలమాలువేసి నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలో వైరా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ పనితి వెంకటేశ్వర్లు, రెబ్బవరం బుడ్డి, కత్తి ప్రభాకర్, గుండె రాము, కృష్ణ, కొమ్ము కొండ, లక్ష్మణరావు,రమణయ్య, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.