Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
విజయదశమి పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరానికి చెందిన గౌడ సంఘం మహిళా నేతలు వీరమళ్ళ ఊర్మిళ, డాక్టర్ వీరమళ్ళ స్వాతిల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను ఖమ్మంలో కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరు తెన్నులు, మద్యం దుకాణాల్లో గౌడలకు రిజర్వేషన్ కల్పించడం హర్షణీయమన్నారు. బాలసానికి పుష్పగుచ్ఛం అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, వీరమళ్ళ విజరు కుమార్, వీరమళ్ళ స్పందన, వి. లోకేష్, కే శ్రీనివాస్, కే. విశ్వతేజ తదితరులున్నారు.