Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఖమ్మం జిల్లా కార్మికుల సమావేశంలో సుడా చైర్మన్ బచ్చు విజరు
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
కార్మికులకు అండగా మంత్రి పువ్వాడ అజరుకుమార్ ఉంటారని సుడా చైర్మెన్ బచ్చు విజరుకుమార్ అన్నారు. ఆదివారం స్థానిక టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్కేవీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు లేనిది ఏ పని జరగదు, కరోనా కష్టా కాలంలో కార్మికులకు ఉపాధి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసినదే, కరోనా కష్టకాలంలో పువ్వాడ ఫౌండేషన్ సహాయంతో నిత్యావసర సరుకులు కార్మికులకు పంపిణీ చేయడం జరిగినదని అన్నారు.
కార్మికులంతా ఐక్యమత్యంగా ఉండి ఒక పెద్ద సంఘంగా ఏర్పాటు చేసుకొని అధ్యక్ష, కార్యదర్శులు ఎన్నిక చేసి కార్మికులంతా కలిసి మెలిసి పనిచేయాలని, తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర ఆధ్యక్షులు పగడల నాగరాజు, కార్పొరేటర్ ఎస్. కె మక్బుల్, సీనియర్ నాయకులు నున్న మాధవ రావు, కార్మిక విభాగం పాషా, పాల్వంచ కృష్ణ, బుర్రి వినరు, రుద్రగాని ఉపేందర్ పాల్గొన్నారు.