Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పేద కుటుంటుంబానికి
రెండు గదుల ఇల్లు నిర్మాణం
నవతెలంగాణ-కొత్తగూడెం
కంటి చూపులేదని ఆధౌర్యపడవద్దూ...నీకు ఉండేందుకు నిలువ నీడగా ఇళ్లు ఉంటుందని... నిరుపేద బాలికకు నీడను కల్పించింది పాఠశాల ఫౌండేషన్ సంస్థ. ఆదివారం పేద కుటుంబానికి నిర్మించిన రెండు గదుల ఇంటిని పాఠశాల ఫౌండేషన్ నిర్వాహకులు కళ్యాణపు శ్రీనివాస్ ప్రారంభించి వారికి అందజేశారు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని పాత కొత్తగూడెంకి చెందిన జంగిలి అనూష (18) యువతి చిన్న తనంలోనే తల్లి, తండ్రులను కోల్పోంది. నాయనమ్మ సంరక్షణలో పెరుగుతుంది. అనూష మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. శారీరక, మానసిక ఇబ్బందులతో పాటు నిలువ నీడలేదు. స్వంత ఇల్లు లేక ఇప్పటి వరకు అద్దె ఇళ్లల్లో వుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి చేదోడు, వాదోడుగా వుండే మేనమామ ప్రమాదవశాత్తు మరణించడం వల్ల వీరిరువురూ దిక్కులేని పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు. వచ్చే ఆసరా పెన్షన్ ద్వారానే పొట్టపోసుకుంటున్నారు. వీరి ధీన గాధను తెలుసుకున్న ''పాఠశాల ఫౌండేషన్'' ప్రతినిధులు అమెరికాలో ఉంటున్న ఫౌండేషన్ నిర్వాహకులు కళ్యాణపు శ్రీనివాస్‌కు తెలియచేయగా అమెరికాలో ఉన్న మిత్రులు, సన్నిహితుల చొరవతో రెండు గదుల ఇంటి నిర్మాణానికి కావలసిన రూ.3 లక్షల నిధులను ఏర్పాటు చేశారు. ఇక్కడి ప్రతినిధుల ద్వారా ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. ప్రస్తుతం అద్దె ఇంటిలో ఉంటున్న వీరికి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ కార్యదర్శి సాధు నర్సింహారెడ్డి, ఖమ్మం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, కొత్తగూడెం 1వ టౌన్ హౌజ్ ఆఫీసర్ బత్తుల సత్యనారాయణల చేతుల మీదుగా ఈ నూతన గృహాన్ని యువతికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ఫౌండేషన్ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ పేదవారికి ఆర్థిక చేయూత అందించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్ర మంలో పాఠశాల ఫౌండేషన్ ప్రతినిధులు కళ్యాణపు సాంబశివ, మాధినేని నర్సింహా రావు, వాసిరెడ్డి రామ్మోహన్, మేధరమెట్ల స్వరూప రాణి, మేదరమెట్ల పుల్లయ్య చౌదరి, మేదరమెట్ల నవీన్, వి.నరేంద్ర స్వరూప్, తాటికొండ రామారావు, సహారా మినిస్ట్రీస్ నిర్వాహకులు లాల్ బహుదూర్ శాస్త్రి, మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ కౌడగాని పరమేష్ యాదవ్, రాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.