Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మండల తహసీల్దార్ లూధర్ విల్సన్ బాధ్యతలు చేపట్టినాటి నుండి విద్యార్ధులకు సంబంధించి నటువంటి ధృవీకరణ పాత్రలను ఎటువంటి పైరవీలు, విద్యార్థులు, వారి తల్లితండ్రులను పలుమార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగకుండా విద్యార్ధులు ధరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను తక్షణమే పరిశీలించి వీలైనంత త్వరగా సకాలంలో విద్యార్ధులకు ధృవీకరణ పాత్రలను అందచేస్తున్నారని మండలంలోని అన్ని గ్రామాల విద్యార్ధులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కులం, ఆదాయం, రెసిడెన్స్, తదితర ధృవీకరణ పత్రాలు కావాలంటే విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుత తహసీల్దార్‌గా లూధర్ విల్సన్ బాధ్యతులు చేపట్టినాటి నుండి నేటివరకు ప్రతి విద్యార్ధికి అసౌకర్యం కలగకుండా సకాలంలో ధృవీకరణ పాత్రలను అందచేస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు వేల్పుల నరసింహారావు మాట్లాడుతూ మండలంలోని విద్యార్ధులు వారి ఉన్నత చదువుల కోసం కులం, ఆదాయం, రెసిడెన్స్ తదితరుల' ధృవీకరణ పత్రాలకోసం విద్యార్ధులు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్తితులు లేకుండా ప్రస్తుత తహసీల్దార్ లూధర్ విల్సన్ త్వరితగతిన అందచేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా టీఎస్ ఎంఆర్పిఎస్ జిల్లా అద్యక్షులు మోదుగు రామకృష్ణ మాట్లాడారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు గార్లపాటి పవన్ మాట్లాడుతూ తహసీల్దార్‌కు ధన్యవాదులు తెలియజేశారు.