Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ఈ నెల 15న అర్థరాత్రి వేళలో ఒక్కసారిగా పిడుగులు, ఉరుములతో కూడిన వర్షంలో ఆళ్ళపల్లి మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో పడిన పిడుగుల పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా అందించే 15 కేవీ సింగిల్ ఫేస్ డీటీఆర్లు 10, 100 కేవీ త్రీ ఫేస్ డీటీఆర్ (ట్రాన్స్ ఫార్మర్) ఒకటి కాలిపోయంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆళ్ళపల్లి మండల కేంద్రంలో 100 కేవీ త్రీ ఫేస్ డీటీఆర్తో పాటు కొమ్ముగూడెం, అనంతోగు, చింతోళ్ళగుంపు, రాఘవాపురం, మర్కోడు, నడిమిగూడెం, కిచనపల్లి (2), సుద్దరేవు, అడవిరామారం గ్రామాల్లో సింగిల్ ఫేస్ డీటీఆర్లు కాలిపోయాయి. వీటిలో మండల కేంద్రంలోని ట్రాన్స్ ఫార్మర్తో పాటు మూడు డీటీఆర్లు పూర్తిగా కాలిపోయాయి. ఇదిలా ఉండగా స్థానిక విద్యుత్ శాఖ ఏఈ రవి, సిబ్బంది మండలంలో ఈనెల 16వ తేదీ ఉదయం నుంచి విద్యుత్ సరఫరా మరమ్మతు పనులు చేపడుతూ ప్రస్తుతం మారుమూల ప్రాంతమైన అడవిరామారం గ్రామం, బోడాయికుంటా, నడిమిగూడెం, మర్కోడు (హాస్టల్) గ్రామాల్లో డీటీఆర్ మరమ్మతు పనులు పూర్తి చేశారు. కాగా పూర్తిగా కాలిపోయాయిన ట్రాన్స్ ఫార్మర్, డీటీఆర్ల స్థానంలో రిప్లేస్ చేయడానికి జిల్లా కేంద్రంలో అందుబాటులో లేకపోవడంతో ఆళ్ళపల్లి మండలంలో గత మూడు రోజులుగా త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా లేక కేవలం సింగిల్ ఫేస్ సౌకర్యం ఉంది. దీంతో గత మూడు రోజులుగా మండలంలో త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా మీద ఆధారపడి బోరుతో వ్యవసాయం చేసుకునే అన్నదాతలు అలాగే అత్యధికంగా ఇండ్లలో బోరు నీళ్లు ఉపయోగించే వారికి, ప్రభుత్వ నల్లా ద్వారా తాగునీరు కోసం, మినరల్ వాటర్ తాగే రాక తాగే నానా అవస్థలు పడుతున్నారు.
ఇకనైనా సంబంధింత విద్యుత్ శాఖ జిల్లా యంత్రాంగం తక్షణమే సరిపడా ట్రాన్స్ ఫార్మర్, డీటీఆర్లను జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంచి, మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ఆళ్ళపల్లి మండలానికి వెంటనే పంపేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. దీంతో పాటు పిడుగులు పడిన సందర్భాల్లో ట్రాన్స్ ఫార్మర్, డీటీఆర్ లు కాలిపోకుండా మండలంలో ఆయా డీటీఆర్ ప్రదేశాలలో తగిన చర్యలు, జాగ్రత్తలు చేపట్టాలని విన్నవించుకున్నారు.