Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ దళితబంధు పేరుతో ఘరానా మోసం
నవతెలంగాణ-కరకగూడెం
రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగులను బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నాడని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ బ్లాక్ కోఆర్డినేటర్ సయ్యద్ ఇబ్బల్ హుస్సేన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మండలంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యువతీ, యువకులు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగలు లేక నరకయాతన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం పచ్చగా ఉండాలంటే యువతే కీలకమని అన్నారు. కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రంలో యువతకు ఎక్కడ ఉద్యోగలు ఇచ్చారని కేసీఆర్ని నిలదీశారు. రాష్ట్రంలో దళితబంధు అనే పేరు చెప్పి ప్రజలను ఘరానా మోసం చేస్తున్నాడని హుజురాబాద్లో ఎన్నికలు ఉన్నందున దళితబందు అని పేరు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసం డ్రామా చేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మహిళా నాయకురాలు చందా రత్నమ్మ, యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.