Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విప్ రేగా లేఖపై స్పందించిన ఎస్బీఐ జనరల్ మేనేజర్
అ హర్షం వ్యక్తం చేస్తున్న మండల వాసులు
నవతెలంగాణ-కరకగూడెం
మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ నూతన బ్రాంచ్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవ తీసుకొని అక్టోబర్ 4వ తేదీన ఎస్బీఐ నూతన బ్రాంచ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఎస్బీఐ బ్యాంక్ జనరల్ మేనేజర్ క్రిషాన్ శర్మకు లేఖ రాసారు. దీనిపై స్పందించిన ఆయన డిప్యూటీ జనరల్ మేనేజర్ (బీఓ), అడ్మినిస్ట్రేటివ్ వరంగల్ కార్యాలయం వారికి నూతన బ్రాంచ్ ప్రారంభించడానికి సాధ్యాసాధ్యాలను అన్వేషించడానికి ఒక సర్వే నిర్వహించాలని తాము సూచించినట్టు అలాగే ఈ విషయంలో తాము మీకు పూర్తి సమాచారాన్ని త్వరలోనే తెలియజేస్తామని విప్ రేగాకు తిరిగి రాసిన లేఖలో తెలిపారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్యాంక్ బ్రాంచ్ మండలంలో ఏర్పాట్లు చేయనున్నడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.