Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
మూడు పర్యాయాలు కాయ కల్ప అవార్డు గెలుచుకున్న ఆసుపత్రి ఇది. అనేక కన్షోలేషన్ అవార్డులు కూడా... ఇవే అనుకుంటున్నారా.... భారత దేశంలోనే మధ్య తరహా వైద్య సేవల్లో 29 రాష్ట్రాల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్కారు దవాఖానాకు ఉత్తమ తృతీయ పురస్కారం, టెస్టుల్లో ద్వితీయ స్థానం లభించడం మనకు ఎంతో గర్వకారణం... ఇంతటి ఘనకీర్తి వున్న ఆసుపత్రిలో కొందరు వైద్యులు మధ్యాహ్నం 2 గంటల వరకూ వుండి సేవలందించల్సిన కొందరు, వైద్య అధికారులు మాత్రం 11.30, 11.45, 12 గంటలకే తమ విధులు నిర్వహించే కుర్చీ నుంచి వుడాయించి తమ ప్రైవేట్ ఆసుపత్రి, ఇతర కార్యక్రమాలకు వెళ్తున్నారనే విమర్శలు లేకపోలేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలు సమయంలోనే మానసిక వ్యాధి చికిత్స నిపుణురాలు సేవల్లో లేరు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మంది వైద్యులు సమయ పాలనను పాటించకుండా... అంతా మా ఇష్టం అనుకుంటూ.. వ్యవరిస్తున్నట్లుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తన శాయశక్తులా పనిచేస్తూ... గాడిన పెట్టే ప్రయత్నం చేయడం వల్లే జిల్లా ఆస్పత్రి సేవలకు గాను జాతీయ స్ధాయిలో అవార్డుల పంట వరించిందని చెప్పవచ్చు. ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, సూపరింటెండెంట్ నిత్య పర్యవేక్షణ వుంటేనే వారీ ఇష్టానుసారాల వ్యవహారాలు, ఈగోలు, మితిమీరిన అహంకారాలకు చెక్ పెట్టవచ్చునని రోగులు భావిస్తున్నారు.
రోజూ వందల సంఖ్యలో ఓపీ రోగులు
కోవిద్ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టాక వైరల్ జ్వరాలు, ఇతర వ్యాధులను నయం చేయించుకునేందుకు ఒక్క ఖమ్మం జిల్లానే కాకుండా సమీప జిల్లాలు సూర్యాపేట, మహబూబబాద్, కొత్తగూడెం, సరిహద్దు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వత్సవాయి, కంచికచర్ల తదితర ప్రాంతాల నుంచి రోగులు రోజుకు సుమారు 1900 నుంచి 2000 వరకూ ఓపీ సేవలకు వినియోగించుకున్నారు. కాగా కొంత మంది వైద్యులు మాత్రం ప్రేమతో, అప్యాయతతో రోగులను పరీక్షిస్తుండగ మరి కొంత మంది జూనియర్ వైద్యులు మాత్రం రోగుల బాధలను, వారు చెబుతున్నది వినిపించుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
ఏజెన్సీల వ్యవహారంతో డ్రెస్ కోడ్ లేని సిబ్బంది
ఏజెన్సీల నిర్వాకంతో.., నిర్లక్ష్యంతో జిల్లా ఆసుపత్రిలో పని చేస్తున్న కొంతమంది సెక్యూరిటీ సిబ్బందికి డ్రెస్ కోడ్ (యూనిఫాం) లేదు. సిబ్బంది అడిగిన స్పందించని ఏజెన్సీ నిర్వాహకులు అంటూ ఆసుపత్రి వర్గాల భోగట్టా... నిత్యం రోగులకు సేవలందుతున్న ఈ ఆసుపత్రికి చికిత్స అవసరం.. ఆని పలువురు పేర్కొంటున్నారు.