Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో టేకులపల్లిలో దసరా పండుగను పురస్కరించుకుని అర్హులైన పాత 37వ డివిజన్, కొత్త 36వ డివిజన్ నిరుపేద ప్రజలకు డ్రా సిస్టం ద్వారా ఎన్నుకోబడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సోమవారం 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిలుగా డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ పాల్గొని, మంత్రి వ్యక్తిగత పీఏ కిరణ్, టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు పాల్గొని అందజేశారు. అనంతరం 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు మాట్లాడుతూ 24 బ్లాక్‌లలో 40 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లకు సంబంధించిన పట్టాలను స్వయంగా వెళ్లి అందజేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ బీసీ కన్వీనర్ గౌరోజు వసంత్ బాబు, గాంధీ చౌక్ వీఆర్వో వెంకటరమణ, జి. గౌరీ శంకర్, చట్టు మురళి, అశ్వనీ పాల్గొన్నారు.