Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంట మార్పిడితోనే నివారణ శాస్త్రవేత్తలు స్పష్టీకరణ
నవతెలంగాణ-కల్లూరు
వరి పంటకు ఆకు ఎండుతెగులు ఆశించిందని వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సోమవారం వైరా కృషి విజ్ఞాన శాస్త్రవేత్త కె. హేమంత్ కుమార్ మండల పరిధిలోని పుల్లయ్య బంజర, లోకావరం, గ్రామాల్లో వరి పొలాలను పరిశీలించారు. ఆకు ఎండుతెగులు బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుందని వరికి రోగనిరోధకశక్తి తట్టుకునే లేక ఈ వ్యాధి వ్యాపిస్తుందని అన్నారు. పంట మార్పిడితోనే నివారణ సాధ్యపడుతుందని తెలిపారు. హైద్రాబాద్ నుండి శాస్త్రవేత్త టి కిరణ్ వచ్చి బ్యాక్టరీయా సంబంధించిన నమూనాలను సేకరించారు. దానిపై రీసెర్చ్ చేసి లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రూప, మాజీ సొసైటీ చైర్మన్ పెద్ద బోయిన. మల్లేశ్వరరావు పెద్దబొయిన. నారాయణరావు ఉప్పు సాంబశివరావు, విష్ణు, రాంబాబు, విస్తరణ అధికారులు పాల్గొన్నారు.