Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఎం మండల కార్యదర్శి బారి మల్సూర్ డిమాండ్
నాయకన్ గూడెంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ-కూసుమంచి
ప్రభుత్వ భూముల పేరుతో నాయకన్ గూడెంలో గత 30సంవత్సరాల క్రితం నుండి ఇండ్లు కట్టుకుని, ఇందిరమ్మ ఇండ్లు, కరెంటు మీటర్లు ఇచ్చి, సిసి రోడ్లు వేసి నివాసం వుంటున్న ఇండ్లను కూల్చివేసి ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖ పేరుతో నోటీసులు ఇప్పించడం ప్రభుత్వం పేదలను రోడ్డున పడేసే కుట్రలో బాగమేనని, పేదల ఇండ్లను కూల్చివేతను అడ్డుకుని ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టెందుకు ఎంతవరకైనా తెగించి పోరాడుతామని సిపిఎం మండలకార్యదర్శి బారి.మల్సూర్, రైతుసంఘం మండల అధ్యక్షులు యడవల్లి రమణారెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నాయకన్ గూడెం సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇండ్ల కూల్చివేతకు ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోవాలని, యాదవులకు గొర్రెలు ఇవ్వాలని, పెండింగ్ ఫెన్షన్లు, పాసుపుస్తకాలు ఇవ్వాలని, వేసవిలో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లే కార్డులు, కొవ్వత్తులతో నినాదాలు ఇచ్చుకుంటూ గ్రామంలో అన్ని వీదులలో ప్రధర్శన జరిపి, ఉర్లుగొండ రోడ్డు సెంటర్ లో సభ జరిపారు. గ్రామ శాఖా కార్యదర్శి ఉల్లోజు కర్ణబాబు అధ్యక్షతన జరిగిన సభలో సీపీఎం మండల కమిటీ సభ్యులు బిక్కసాని గంగాధర్, గోపె వినరు కుమార్, శీలం జానయ్య, గ్రామ నాయకులు కంచర్లజగన్మోహన్ రెడ్డి, గడ్డం మురళి, మేకల అంజయ్య, ఉల్లోజు వేణు, సింగం కృష్ణంరాజు, గడ్డం పవన్, చిలకబత్తిని శ్రీహరి, శ్రీను, ఎళ్లిమళ్ల పవన్, లిక్కి లింగయ్య, ఉల్లోజు పురుషోత్తం, ఐద్వా నాయకురాలు గడ్డం అంజమ్మ, లింగమ్మ, ఎన్నెస్పీ కాలువ కట్ట భూ నిర్వాసితులు ఉల్లోజు ఉపేంద్రమ్మ, పెద్దవెంకన్న, ఉపేందర్, కుమార్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు.