Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్రమ కేసులు వెంటనే కొట్టివేయాలి : సీపీఐ(ఎం), కాంగ్రెస్
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మండలంలో టిఆర్ఎస్ ఆగడాలను అరికట్టాలని సీపీఎం, కాంగ్రెస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే కొట్టివేయలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అన్నారు. వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద గల తమ్మినేని సుబ్బయ్య భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ అరేకొడు గ్రామంలో దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా గ్రామంలోని టిఆర్ఎస్ కార్యకర్తలు రౌడీయిజం ప్రదర్శించి దాడులకు పాల్పడటం దారుణమన్నారు. అరేకొడు సర్పంచ్ ఉప్పగండ్ల వెంకటనారాయణ, ఉప సర్పంచ్ గునిగంటి సత్య నారాయణలు ఖమ్మంలో నివసిస్తూ గ్రామంలోని కొంతమంది ఆకతాయిలతో రౌడీయిజం చేపిస్తూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు బెల్లం వేణు అండగా ఉంటూ కాంగ్రెస్, సీపీఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. తమ స్వలాభం కోసం కొంతమంది ఆకతాయిలను పెంచి పోషిస్తూ అమాయకులపై దాడులకు దిగడం హేయమైన చర్య అన్నారు. గ్రామానికి చెందిన మల్లెల వెంకట నారాయణ, సిలివేరు రామారావు, దొంతగాని వెంకట నారాయణ మరికొంత మంది యువకులు గ్రామంలో రౌడీయిజం చలాయి స్తున్నారని తెలిపారు. పోలీస్ శాఖ, మంత్రి పువ్వాడ అజరు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డిలు కలుగజేసుకొని వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేసారు. సమా వేశంలో సీపీఎం నాయకులు సిలివేరు బాబు, కాంగ్రెస్ నాయకులు ఉప్పగండ్ల ప్రసాద్, గాంధీ, సిపిఎం నాయకులు సిలివేరు కృష్ణ, సత్యనారాయణ, మార్కం లింగయ్య, మార్కం నాగేశ్వరరావు, ప్రసాద్, రాజు, సిలివేరు వెంకన్న పాల్గొన్నారు.