Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వామపక్షాలు, కాంగ్రెస్ అనుబంధ రైతుసంఘాల ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన రైలురోకో నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు రైల్‌రోకో నిర్వహించేందుకు రైతులు, రైతుసంఘాల నేతలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. ఏసీపీ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు రైల్వేస్టేషన్ వద్ద భారీగా మొహరించారు. పెవిలియన్‌గ్రౌండ్ నుంచి ర్యాలీగా వచ్చిన నిరసనకారులు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నిరసనకారులు రోడ్డుపై బైటాయించారు. రైల్వేస్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని నేతలు ధ్వజమెత్తారు. అందుకే రైల్‌రోకో నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రధాని మోడీ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ ఆరోపించారు. మోడీ నేతృత్వంలో బీజేపీ అరాచక పాలన సాగిస్తోందన్నారు. యావత్తు దేశ సంపదను కార్పొరేట్‌కు కట్టబెడుతూ...దాన్ని వ్యతిరేకించిన వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదన్నారు. లిఖింపూర్ ఘటనకు కారకులైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరుమిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా నల్లచట్టాలను రద్దు చేసే వరకు పోరాడుతాం అన్నారు. రైతాంగ పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోడీకి వత్తాసు కొడుతూ కేసీఆర్ రైతు వ్యతిరేక చట్టాలపై ఆందోళనను అడ్డుకోవడం సహేతుకం కాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా నాయకులు యర్రా శ్రీనివాస్, వై.విక్రమ్, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, శింగు నర్సింహారావు, జానీమియా, అడపా రామకోటయ్య, కొండవర్తి గోవిందరావు, పోటు కళావతి, సీతామహాలక్ష్మి, లతాదేవి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, పుల్లయ్య, శిరోమణి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్కా శేఖర్‌గౌడ్, నాయకులు సంపటి నర్సింహారావు పాల్గొన్నారు.
గాంధీచౌక్ : నలుగురు రైతులను చంపిన నరహంతకుడు బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు అజరు మిశ్రాను వెంటనే ఉరి తీయాలని, రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని సోమవారం ఖమ్మం పత్తి మార్కెట్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాది నేని రమేష్, సిపిఎం రాష్ట్ర నాయకులు యర్రా. శ్రీకాంత్‌లు డిమాండ్‌చేశారు. ఈ నిరసన కార్యక్రమం సభకు సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, త్రీటౌన్ నాయకులు బండారు యాకయ్య, తుషాకుల లింగయ్య, యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, ఎస్కే సైదులు, వజినేపల్లి శ్రీనివాసరావు, షేక్ హిమామ్, పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు, ఎస్.కె బాబు, రంగు హనుమంత చారి, ఎస్కె ఖాసిం, వేల్పుల నాగేశ్వరరావు, పాశం సత్యనారాయణ, మద్ది శ్రీను పాల్గొన్నారు.
కూసుమంచి : మండల కేంద్రంలో సిపిఎం, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నేషనల్ హైవే రోడ్డుపై రాస్తారోకో చేసి మోదీ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బారి మల్సూర్, న్యూడెమోక్రసీ కార్యదర్శి బజ్జూరి వెంకట్రామిరెడ్డి, నాయకులు యడవల్లి రమణారెడ్డి, బిక్కసాని గంగాధర్, మాతంగి రామస్వామి, గోపె వినరు, తాళూరి వెంకటేశ్వర్లు, మూడు గన్యానాయక్, నిమ్మల వెంకన్న, దాట్ల వీరస్వామి, నల్లమల క్రిష్ణయ్య, చాపల రాములు, పందిరి వీరారెడ్డి, కొరట్ల పాపయ్య, జగదీష్, శేఖర్, మధు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : మండలంలోని వెదుల్లచెరువు, బీరోలు, తిరుమలాయపాలెం, మేడిదపల్లి, బంధంపల్లి, హైదర్ సాయిపేట గ్రామాలలో రోడ్లపై సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, రైతు సంఘం మండల అధ్యక్షులు తుళ్లూరు నాగేశ్వరరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు వేగినాటి వెంకట్రావు, గోపోజు రవి, బందారపు సైదులు, దాసరి మహేందర్, రావుల వెంకట్రామిరెడ్డి, దిండు మంగపతి, కాంపాటి శ్రీదేవి, శాఖ కార్యదర్శిలు మచ్చర్ల రాజశేఖర్, కోడి లింగయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : లఖింపూర్‌లో జరిగిన ఘటనకు నిరసనగా కాన్వారు తో రైతులపై కార్ తో దాడి చేసి నలుగురు రైతులను పొట్టనబెట్టుకున్న కేంద్ర మంత్రి కొడుకును శిక్షించాలని, మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని సిపిఎం ఆధ్వర్యంలో భీమవరం గ్రామంలోని బోడేపూడి భవనం సిపిఎం కార్యాలయం వద్ద మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు గొల్లపూడి కోటేశ్వరరావు, షేక్ జానీమియ, నాగులు, నారాయణ, కోటేశ్వరరావు, భాస్కరరావు, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.