Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రముఖ న్యూరాలజిస్ట్ వైద్యులు
గోపాలం శివన్నారాయణ
అ ఆరోగ్యంపట్ల అశ్రద్ద వద్దు :
నున్నా నాగేశ్వరరావు
అ ఖమ్మం త్రీటౌన్‌లో డా. వైఆర్‌కె
స్మారక సదస్సు
నవతెలంగాణ-గాంధీచౌక్
ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని ప్రముఖ న్యూరాలజిస్ట్ వైద్యులు గోపాలం శివన్నారాయణ అన్నారు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో స్థానిక వర్తక సంఘం భవనంలో మంగళవారం జరిగిన వైఆర్‌కె 8వ వర్ధంతి స్మారక సదస్సులో నున్నా నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శిబిరం నిర్వాహకులు రిటైర్డ్ ఆర్.జెడి యాదాల ఛార్లెస్ అధ్యక్షతన జరిగిన స్మారక సదస్సులో గత రెండు సంవత్సరాల నుండి నిర్విరామంగా జరుగుతున్న డా.వై.ఆర్.కె నెల నెలా వైద్య శిబిరం సేవలు అభినందనీయమని ప్రముఖ గ్యాస్ట్రిలాజిస్ట్ డా. శివ నారాయణ అన్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ఆరోగ్యపరంగానే కాక ఆర్థికపరంగా కూడా బాగా నష్టపోతున్నారని తెలిపారు. వైద్య ఖర్చులు, మందుల ఖర్చులు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు చేతనైనంత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో, ప్రజా వైద్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు యలమంచిలి రాధాకృష్ణమూర్తి పేరు మీద వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా మంచి విషయమని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి ప్రతి నెల రెండవ శనివారం ప్రముఖ వైద్య సిబ్బంది, వాలంటీర్ల బృందం శిబిరంలో ఉచితంగా ప్రజలకు సేవలు అందిస్తూ, కేవలం 100 రూపాయలకే నెలకు సరిపడా బీపీ, షుగర్ మందులను అందించటం గొప్ప విషయమని కొనియాడారు. వై.ఆర్.కె వైద్య శిబిరం సేవలు పేద , మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. శిబిరాన్ని మరింత విస్తృతపరిచి, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని నిర్వాహకులను ఆయన కోరారు. ఈ కృషిలో తాను ఎల్లవేళలా శిబిరానికి అండదండలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. మంచి ఆహారం, శారీరక పని లేదా వ్యాయామం నిత్యం చేస్తూ ఉండాలని తెలిపారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్లను సంప్రదించాలని, తగిన వైద్యాన్ని చేయించుకోవాలని కోరారు. ఈ విషయంలో ప్రజలకు సేవలు అందించడానికి డా.వైఆర్‌కె వైద్య శిబిరం తనవంతు బాధ్యతలను నిర్వహించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రతి నెల రెండవ శనివారం వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉచితంగా వైద్య సలహాలను అందిస్తూ, దీర్ఘకాలిక జబ్బులైన బీపీ , షుగర్ పేషంట్స్ కు నెలకు సరిపడా మందులను కేవలం రూ.100కే అందిస్తున్నామని తెలిపారు.ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం డా.భారవి, డా.పిల్లలమర్రి సుబ్బారావు, డా.కెయు.భాస్కర్, డా.వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, కార్పొరేటర్ల్ యల్లంపల్లి వెంకట్రావు, యర్రా గోపి, భుక్యా శ్రీనివాసరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు బండారు వీరబాబు, బజ్జూరి రమణారెడ్డి, వాలంటీర్ల బృంద సభ్యులు యర్రా శ్రీనివాసరావు, తుశాకుల లింగయ్య, బండారు రమేష్, పత్తిపాక నాగసులోచన, ఇంటూరి అశోక్, శీలం వీరబాబు,, యస్‌కె బాబు, ఎస్.కె హిమమ్, వేల్పుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.