Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీస్ కమిషనర్
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని గురువారం నుండి పది రోజుల పాటు పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ ఒక ప్రకటన లో తెలిపారు. నేషనల్ ఫ్లాగ్ డే సందర్భంగా మొదటి రోజున రోజు కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేయడం, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 21వ తేదీన జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్ స్మారక స్డూపం వద్ద ఫ్లాగ్ డే పరేడ్ నిర్వహిస్తామని తెలిపారు. 22 నుంచి 24వ తేదీ వరకు గాయపడిన, మృతి చెందిన పోలీస్ కుటుంబాల ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించడం, వారి యోగ క్షేమాలు, సంక్షేమంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఫ్లాగ్ డేలో భాగంగా 23న జిల్లా పోలీసు కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ల, సబ్ డివిజన్ల పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 25న సైకిల్ ర్యాలీ, 26 తేదీన ఆన్లైన్ ఓపెన్ హౌస్, 27, 28 తేదీలలో పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామాలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేలా కృషి చేయడం జరుగుతుందని, 28న పాఠశాల, కళాశాల విద్యార్థులకు జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర అనే అంశంపై ఆన్ లైన్ లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు. ఆన్లైన్ లో నిర్వహించే ఈ పోటీలు ష్ట్ర్్జూర://టశీతీఎర.స్త్రశ్రీవ/బజీj58ఞశచీ1+Qూచీjజూ లింక్ ద్వారా పాల్గొనాలని సూచించారు. వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వ్యాసాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారి ఫేస్ బుక్లో ప్రచురించడం జరుగుతుందన్నారు. పోలీస్ సంబంధిత షార్ట్ ఫిల్ములు, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తామని ఆసక్తి కలిగిన వారు మూడు నిమిషాల నిడివితో పోలీసుల సేవలు, త్యాగాలు ప్రతిబింబించేలా తాజాగా రూపొందించిన చిత్రాలు, ఫొటోలు పంపించాలని తెలిపారు. షార్ట్ ఫిల్ములు, ఫొటోలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెబ్ సైట్, ఖమ్మం జిల్లా పోలీస్ వెబ్ సైట్ లలో, సిడీల రూపంలో ఈ నెల 30వ తేదీ లోగా సమర్పించాలని సూచించారు. ఎంపిక కాబడిన ఫొటోలు, షార్ట్ ఫిల్ములు రాష్ట్ర స్థాయికి పంపిస్తామన్నారు. విజేతలుగా నిలిచిన వారికి, పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. అన్ని రకాల పోటీలలో విజేతలను నిర్ణయించి వారి వివరాలను జిల్లా పోలీసు పోర్టల్ లో ఉంచుతామన్నారు. గెలుపొందిన పోలీసు అధికారులకు బహుమతులు అందిస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
అదే విధంగా 27వ తేదీన పోలీస్,హౌంగార్డు అధికారులకు సిబ్బందికి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాలను పోలీసులు ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై మొదటి క్యాటగిరి, చిన్నారులు, మహిళల హక్కుల రక్షణ, సమాజంలో వెనుకబడిన వారి హక్కుల రక్షణలో పోలీసుల పాత్ర అనే అంశంపై రెండవ క్యాటగిరి కింద వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు.