Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జన్మదినాన్ని పురస్కరించుకొని పూజలు
నవతెలంగాణ-తల్లాడ
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని, తల్లాడ మండలంలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి, సందర్భంగా మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, జాగారం చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బలహీనతలతో కొట్టుమిట్టాడే మనుషుల బాహ్యం తరంగాలను సంస్కరిచేందుకు సృష్టికర్త అల్లా పంపిన చిట్టచివరి ప్రవక్త మహమ్మద్ అత్యుత్తమ జీవన విధానానికి మార్గదర్శి మానవతా దృక్కోణంతో ఆధ్యాత్మిక మార్గం చూపిన మహౌపకారి, మొహమ్మద్ మృదువైన మాట తీరుతో మనసులు గెలుచుకునే వారు. తెల్లని వస్త్రధారణతో ఆకర్షణీయంగా, లక్షలాది అరబ్బులను ఆకట్టుకునేవారు. చిరునవ్వుతో సలాం చేసి ప్రేమగా ఎదుటివారిని పలకరించి ఆత్మీయంగా మాట్లాడేవారు. ఎవరైనా కానుకలు ఇస్తే బదులుగా కానుకలు ఇస్తూ అల్లా దయ కోసం ప్రార్థించేవారు. పసిపిల్లల అంటే అమితంగా ఇష్టపడే ప్రవక్త మహమ్మద్ వారిని దేవుడి ఉద్యానవనంలో పుష్పాలు వ్యవహరిస్తూ ఆటలు ఆడేవారు. చిన్న పిల్లలకు ముందుగా ఆయనే సలాం చేసేవారు. మహిళలను గౌరవించేవారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మీలాదున్నబీగా వ్యవహరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు జాగారాలు చేశారు.