Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వైయస్సార్ టీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు
సుధారాణి
నవతెలంగాణ-గుండాల
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావాలని, రాజన్న రాజ్యం మల్లీ రావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తాడిపత్రి సుధారాణి అన్నారు. వైయస్సార్ టీపీ అధినేత్రి షర్మిల ప్రారంచబోయే మహా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ పినపాక నియోజకవర్గ నాయకులు మాడె మంగయ్య ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించి అధినేత్రి షర్మిల పేరు మీద రామాలయంలో అర్చన చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడానికి, సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందించాలనే ఆలోచనతో వైయస్సార్ కూతురు షర్మిల పార్టీ స్థాపించి ముందుకు వెళ్తుందన్నారు. షర్మిల ప్రారంభించే మహా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం అయ్యి షర్మిల ముఖ్యమంత్రి కావాలంటే ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని నియోజకవర్గ నాయకులు మాడె మంగయ్య పిలుపు నిచ్చారు. అనంతరం వివిధ గ్రామాల నుండి 30 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తవిడిశెటటట్ట రాంబాబు, ఆళ్ళపల్లి మండల కన్వీనర్ కర్కపల్లి సుధాకర్, శేఖర్, రాజబాబు, భరత్, భరత్ రెడ్డి, శ్రీధర్, మోహన్ రావు, చంటి, హరిక్రిష్ణ పాల్గొన్నారు.