Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గిరిజనులు ఏళ్ల తరబడి పోడు కొట్టి సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కులు కల్పించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమక్రసీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం గంగారం, అడివరామవరం గ్రామాలలో జరిగిన పోడు రైతుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమావేశంలో నాయకులు సున్నం వీరభద్రం, అర్జున్, వెంకన్నబాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి : ఆళ్ళపల్లి, గుండాల ఉమ్మడి మండలాల ఎన్డీ నాయకులు పోడు భూముల సమస్యల పరిష్కారానికి సోమవారం భద్రాచలం ఐటీడీఏ అసిస్టెంట్ పీవో డేవిడ్ రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఆళ్ళపల్లి మండల కేంద్రములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి మండలాల ఎన్డీ నాయకులు గొగ్గెల గాదెరాజు, బొర్రా వెంకన్న మాట్లాడుతూ.. ఆళ్ళపల్లి మండల పరిధిలోని సీతారాం పురం, అనంతోగు గ్రామాల పోడు భూముల రైతులు, గుండాల మండల పరిధిలోని కాచనపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల పోడు భూముల రైతులు పట్టాలు రాక, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాడులు భరించలేక నానా అగచాట్లు, అవస్థలు పడుతున్నారన్నారు. ఉమ్మడి మండలాల్లోని నాలుగు గ్రామాల పోడు భూముల రైతులు ఇచ్చిన దరఖాస్తులను సెక్షన్‌కు పంపించి పట్టాలు త్వరితగతిన అందజేస్తానని పీవో హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పూనెం పాపయ్య, కుంజ వెంకన్న, వజ్జ జగన్, వూకె రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.