Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పామ్ ఆయిల్ రైతు నేత పుల్లయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాష్ట్రంలో ఆయిల్ ఫాం సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని పామ్ ఆయిల్ సాగు దారుల తరుఫున రైతు నేత కొక్కెరపాటి పుల్లయ్య ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్‌కు మంగళవారం ఆయిల్‌ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసారు. అనంతరం ఆయన వినతి పత్రంలోని ఒక్కొక్క అంశాన్ని చదివి సాధ్యాసాధ్యాలను పుల్లయ్యకు వివరించారు.
పామాయిల్ మొక్కల నర్సరీకి సంబంధించిన సమస్యలు
1) మొక్కల పెంపకంలో కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేయాలి.
2) మొక్కల పర్యవేక్షణ అగ్రికల్చరల్ కళాశాల హెచ్ఓడీ ద్వారా సూచనలు సలహాలతో మొక్కలు పెంచాలి. వారు సర్టిఫై చేసిన తరువాతనే మొక్కలు రైతులకు ఇవ్వాలి.
3) మొక్కల పంపిణీ వ్యవస్థను హార్టికల్చరల్ శాఖ పరిధిలోకి తీసుకొనిరావాలి.
4) మొక్కల కోసం రైతులు పెట్టుకున్న ధరఖాస్తులను ప్రాధాన్యతాక్రమం బయోమెట్రిక్ విధానంతో పంపిణీ చేయాలి.
5) భూ రికార్డులలో లేని రైతులు సాగులో ఉండి పామాయిల్ మొక్కల కొర రైతులందరికీ హార్టికల్చర్ ఆధ్వర్యంలో మొక్కలు ఇవ్వాలి.
6) హార్టికల్చర్ గ్రాడ్యుయేషన్ ఉండి నర్సరీలలో అనుభవం ఉన్న ఉద్యోగులను మొక్కలు పెంపకం విభాగానికి అధికారిగా నియమించాలి.
7) ప్రస్తుతం ఆయిల్ ఫెడ్ కార్యాలయ పరిధిలో గల భూమిలోనే మొక్కలు పెంపకం జరగాలి.
8) మొక్కల పంపిణీ ఏ రోజుకు ఆరోజు పారదర్శకంగా బోర్డులో రైతు పేర్లు మరియు మొక్కల సంఖ్యను పెట్టాలి.
ఫ్యాక్టరీ పరిస్థితులు
1) డిజిటల్ ఆటోమేటిక్ వే బ్రిడ్జి (కాటా)లను ప్రతీఫ్యాక్టరీలలో రెండు ఏర్పాటు చేయాలి.లోపలకు వెళ్ళే వద్ద ఒకటి మరియు బయటకు వచ్చే వద్ద ఒకటి. ఈ రెండింటికీ సమాచారం అనుసంధానం చేయాలి.
2) వేమెంట్ స్లిప్ మీద తేదీ, సమయం ఉండేటట్లుగా చూడాలి.
3) ఫ్యాక్టరీ ఒక్కరోజు క్రషింగ్ సామర్ధ్యానికి సరిపడా ఫ్రూట్ అన్ లోడింగ్ సరిపడా ప్లాంట్ ఫాం ఏర్పాటు చేయాలి.
(ఉదా: అప్పారావుపేటలో 1200 టన్నులకు,అశ్వారావుపేట లో 600 కన్నులకు సరిపడా)
4) ఫ్యాక్టరీ పరిధిలో క్యాంటిన్, రైతులకు, ట్రాక్టర్ డ్రైవర్స్‌కు విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలి.
5) ఏరోజుకు ఆరోజు 24 గంటల వ్యవధిలో ఫ్రూట్ ఇన్పుట్, ఆయిల్ రికవరీ మెసేజ్ ద్వారా రైతులకు సమాచారం తెలియజేయాలి.
6) క్రూడ్ ఆయిల్ విక్రయించిన ధరతో కూడిన బిల్లును రైతులకు మెసేజ్ ద్వారా
సమాచారం ఇవ్వాలి.
7) ఫ్యాక్టరీ ఓడయం కాంట్రాక్టు విధివిధానాలు, కాల పరిమితి, కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వర్కర్స్ సంఖ్య, కాంట్రాక్టరు చెల్లించే మొత్తం డబ్బు ఎంత అనే వివరాలు బోర్డుపై సమాచారం తెలియపర్చాలి.
ఎఫ్.కోడ్
1) ప్రస్తుతం ఉన్నటువంటి ఎఫ్.కోడ్లను, ఎఫ్.టీ కోడ్లను (ట్రేడర్స్) రద్దు చేయాలి.
పామాయిల్ తోటలను జియో ట్యాగింగ్ చేయాలి. కొత్త ఎఫ్.కోడ్లను రైతులకు అందజేయాలి.
2) రైతులు పామాయిల్ తోటలను అమ్ముకున్నా లేదా కౌలుకు ఇచ్చినా పాత కోడ్‌ను రద్దు చేసి కొత్త కోడను సాగులో ఉన్నవారికి ఇవ్వాలి.
3) సాగులో ఉన్న రైతులకు తోట అగ్రిమెంట్ కాల పరిమితి అనంతరం ఎఫ్ ఎఫ్.కోడ్ ను రద్దు చేయాలి.ఎఫ్ కోడ్ కార్డుపై కాలపరిమితి ముద్రించాలి. ఎఫ్.కోడ్‌లో తోట విస్తీర్ణ,గరిష్టంగా పండే పంట సుమారుగా ముద్రించాలి.
4) ఫ్రూట్ కలెక్షన్ సెంటర్‌కు గెలలు తీసుకు వచ్చిన రైతులకు రవాణా చార్జీలు చెల్లించాలి.
5) ఫ్రూట్ కలెక్షన్ సెంటర్ ఏజెంట్ పేరు కలెక్షన్ సెంటర్ గ్రామము పేరు, ఆ ప్రాంతం విస్తీర్ణం, కలెక్షన్ ఏజెంట్‌కు చెల్లించే రవాణా చార్జీలు వివరాలు, లోడింగ్ చార్జీలు వివరాలు ఆ కలెక్షన్ సెంటర్లో బోర్డుపై ప్రదర్శించాలి.
6) ఎఫ్ కోడ్ ఉన్న ప్రతీ రైతు ఫోన్ నెంబరు వాట్సాప్ గ్రూప్ లేదా అటువంటి ఏదైనా డిజిటల్ ప్లాట్‌ఫామ్ గ్రూపుగా ఏర్పాటు చేయాలి. అందరు రైతులను ఒకే ఏర్పాటు చేయాలి.
బై ప్రొడక్ట్సు
1) ఫామ్ గింజల నుండి వచ్చే ఆయిల్, గింజలలో మిగిలిన పప్పు విక్రయాల్లో వచ్చిన ఆదాయాన్ని గెలలు ఆదాయంలో 75.25శాతాన్ని రైతులకు ఇవ్వాలి.
2) ఫామ్ పైబర్, డీమక్కు రైతులకు ఉచితంగా ఇవ్వాలి.
3) ఆయిల్ రీఫైనరీ పరిశ్రమను ఆయిల్ఫైడ్ యాజమాన్యంలోనే ఏర్పాటు చేయాలి.
4) రైతులకు ఎరువులు, పురుగుమందులు కలుపు మందులు మరియు పామ్ ఆయిల్ తోటలకు అవసరమైన పరికరాలు ఆయిల్ఫైడ్ డివిజన్ కార్యాలయ ఆధ్వర్యంలో రైతులకు సరసమైన ధరలకు అమ్మాలి.
ఈ కార్యక్రమంలో సాగు దారులు తుమ్మా రాంబాబు, అల్ల నాగేశ్వరరావు, గొడవర్తి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.