Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాల నియంత్రణ సులభతరం అవుతుందని, చోరీలను నియంత్రించవచ్చని వైరా సీఐ వసంత కుమార్ అన్నారు. మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామంలో సర్పంచ్ లక్ష్మి అధ్యక్షతన జరిగిన సీసీ కెమెరాలో అవగాహనా సదస్సు సీఐ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీలు చేసేందుకు చోరులు భయపడతారని, అసాంఘిక కార్యక్రమాలు చేసేవారు సీసీ కెమెరాలు దొరుకుతాయని భయపడుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గజ్జెల నరేష్ సిబ్బంది పాల్గొన్నారు.