Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పార్టీ బలోపేతానికి కషి చేసిన మంత్రి పువ్వాడ అజరు కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. మంత్రి పువ్వాడ అజరు కుమార్ నేతత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై నాయకులను ఆరా తీశామన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పార్టీ బలోపేతానికి కషి చేసిన మంత్రి పువ్వాడ అజరు కుమార్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పువ్వాడ అజరు కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పార్టీకి విజయాలే తప్ప ఓటమి చవి చూడలేదన్నారు. మంత్రి పువ్వాడ అజరు కుమార్ వ్యూహచతురతకు, చిత్తశుద్ధి కి అసాధరణ విజయాలతో పార్టీలోని ప్రతి ఒక్కరికీ బలోపేతం చేయాలనే మరింత పట్టుదల వచ్చిందన్నారు. ఎందరో రాజకీయ ఉద్దండులను చూసిన ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజరు విలక్షణం అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో యువకుడు.. ఏం చేస్తాడులే అనుకున్న పరిస్థితి నుండి విమర్శకులు, ప్రత్యర్ధుల చేతే రాజకీయంగా అందరివాడు అనిపించుకోవడం అసామాన్యమన్నారు.