Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చింతకాని
సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు సీతంపేట గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రహీంకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన రూ.22,500 చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరావు, సీతంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి బసవయ్య, సీతంపేట గ్రామ సర్పంచ్ నారపోగు కొండలరావు, చిన్న మండవ ఎంపీటీసీ సభ్యులు నార పోగు యాకోబు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాటమనేని పుల్లయ్య, ఆళ్ల సుధాకర్ రావు, మాజీ వార్డు నెంబర్ నారపోగు వెంకటేశ్వర్లు, 8వ వార్డు నెంబర్ షేక్ హుస్సేన్, కంచర్ల సైదులు, రాగ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు .