Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అభ్యర్థులకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారని ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ బీ.కొండల్రావు కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బోనకల్ మండల పరిధిలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధపడే అభ్యర్థులు పూర్తి వివరాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నమోదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువులోగా సంప్రదించిన అభ్యర్థులకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి,అ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఖమ్మం కమిషరేట్ పరిధిలోని నిపుణలతో ఉచిత శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వివరాలకు 9440904262 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.