Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్లో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటివైద్య శిబిరాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ గుండ్రా రాఘవేంద్రరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 90 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షులు దారా కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని, దానిలో భాగంగానే ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మందులు, కళ్లజోళ్లు పంపిణీతో పాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకమరాజు, అప్పారావు, అంగన్వాడీ టీచర్ అవ్వమ్మ పాల్గొన్నారు.