Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఐటీయు జిల్లా అధ్యక్షులు విష్ణువర్థన్
ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికుల ఆందోళన
నవతెలంగాణ- ఖమ్మం
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళను ఉద్దేశించి అయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు 18 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు సామాజిక వర్గాలకు చెందినవారని, రెక్కాడితే డొక్కాడని పేదలకు వేతనాలు పెండింగ్ పెట్టడం సరైనది కాదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే కార్మికుల వేతనాలు చెల్లించకపోతే సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ టూటౌన్ కార్యదర్శి కాంపాటి వెంకన్న, నాయకులు కళ్యాణి, మానస, సైదమ్మ, ఉషా, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.