Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఓటింగ్ మొబైల్ మాక్ ఓటింగ్ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ విషయాన్ని కమిషనర్ వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చేపట్టిన డమ్మీ ఓటింగ్ ప్రక్రియ బుధ వారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిందని చెప్పారు. మొబైల్ లో రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా ఓటు నమోదు జరిగిందని పది వేల మందికి అవకాశం ఉండగా సుమారు 14,804 మంది నమోదుకు ప్రయత్నిం చారని పేర్కొన్నారు. ఆధార్, ఓటరు వివరాల ఆధారంగా సుమారు 3,830 మంది ఓటుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. బుధవారం జరిగిన మాక్ ఓటింగ్లో 2,128 ఓట్లు 55.6 శాతం వినియోగించుకున్నారని తెలిపారు. ఆల్ఫా, బీటా, గామా, నోటా క్యాటగిరి వారీగా ఓటుపై ఉందన్నారు. ఓటర్ల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని 90 శాతం మంది గుడ్ అన్నారని, 70 శాతం మంది ఎక్స్ లెంట్ అన్నారని ఆయన వివరించారు. 80 శాతం మంది యాప్ యూజర్ ఫ్రెండ్లీ గా ఉన్నదనని చెప్పారు. ఓట్ల కౌంటింగ్ ఎన్నికల సంఘం వారు పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ ఓటింగ్ మొబైల్ మాక్ ఓటింగ్ సహకరించిన వారందరికీ కమిషనర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.