Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాధపాలెం
గత 75 సంవత్సరాలుగా మండల వ్యాప్తంగా పోడు భూములను సాగు చేస్తున్న రైతులను, బుధవారం పుటనితండ గ్రామంలో పర్యటించి పరామర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నాదెండ్ల పుల్లయ్య మాట్లాడుతూ... గిరిజన రైతులు పోడు భూములను నమ్ముకొని, సాగు చేసి జీవిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నర్సరీల పేరిట గిరిజన పేద రైతుల నుంచి భూమిని లాక్కోవడం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నర్సరీ, ఇతర సదుపాయాల కోసం పాడుబడిన, మరియు రైతుల దగ్గర సాగులో లేని పోడు భూములను, మరియు సీలింగ్ భూములను, అసైన్డ్ భూములను గుర్తించాలని వారన్నారు. కానీ పేద రైతు సాగుచేసుకుంటున్న భూములను లాక్కోవడం దురదృష్టకరమన్నారు. ఇలా జరిగితే రాబోయే రోజుల్లో పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు, మండల నాయకులు గుగులోతు హరి, బానోతు నాగేశ్వరరావు, గుగులోతు లక్ష్మణ్, భూక్య సక్కుబాయి పాల్గొన్నారు.