Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలోఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహర్షి వాల్మీకిని స్మరిస్తూ సంస్కతంలో పద్యాలు వ్రాసిన మొదటి కవి మహా ఋషి వాల్మీకి అని, వారిని ఆదికవి అని కూడా అంటారని తెలిపారు. వేటను చేసిన వాల్మీకి మహా ఋషిలా మారాడన్నారు. వారు రాసిన రామాయణాన్ని ఆదికావ్యంగా పేర్కొం టారని, వారు 24 వేల పద్యాలు రచించారని పద్యాల సమాహారమే రామాయణం అని, సంస్కతంలో పదాలను రచించడం రామయణంతోనే ప్రారంభ మయిందని, రామాయణ మహా కావ్యం ద్వారా సర్వజనులకు జ్ఞానబోధన చేశారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివద్ధి అధికారి జ్యోతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా,, మాలతీ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి కె.సత్యనారాయణ, జిల్లా ఉద్యానవన శాశాధికారి అనసూయ, జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య, జిల్లా సంక్షేమ శాఖాధికారి సంధ్యారాణి, జిల్లా ఉపాధికల్పనాధికాని శ్రీరామ్, ప్రాంతీయ రవాణా శాఖాధికారి కిషన్, బి.సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిండిప్రోలు రామమూర్తి, ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటి సెక్రటరీ బి. నందకిషోర్, వాల్మీకి బోయ సంఘం పట్టణ అధ్యక్షులు డి.శ్రీనివాస్, సంఘం సెక్రటరీ కంది ఉపేందర్, సభ్యులు బి.రవి, బి.సి ఎంప్లాయిస్ సంఘం అధ్యక్షులు సి.హెచ్.రమేష్, యం.బి.సి నాయకులు ఎస్.కె. షకీన, మహిళ బి.సి సంఘం నగర అధ్యక్షులు సుగుణ, టి.రమణ, సి.హెచ్. పుల్లయ్య, బ్రహ్మం వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.