Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూటీఫ్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
రాష్ట్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీ పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని టీఎస్ యూటీఎస్ జిల్లా కార్యదర్శి డీఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మండల పరిధిలో గొల్లగూడెం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలోనే మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించారని తెలిపారు.వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలను పునప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖలు, హైకోర్టు ప్రత్యేక అనుమతులు తీసుకొనుటకు చొరవ చూపాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, కన్వర్టడ్ ఆశ్రమ పాఠశాల పోస్టులు మంజూరు చేయాలని, సిఆర్టీ లకు పీఆర్సీ జీవో ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో నారాయణ, శివాజీ, శోభన్, హాము, ఆశిబ్ మియా, బాలస్వామి, లక్ష్మీదేవి, సరస్వతి, సుజాత, అనూష, వీరన్న, సింగ్యా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.