Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటికి తాళమేసి వెళ్లిపోయిన కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-కారేపల్లి
ప్రేమించి పెండ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంట్లో ప్రియురాలు చేస్తున్న దీక్ష రెండోవ రోజు గురువారం కూడా కొనసాగింది. కారేపల్లి మండలం కోనం సునిత కారేపల్లికి చెందిన సముద్రాల వేణు ప్రేమించుకున్నారు. పెండ్లి చేసుకుంటానని మాయమాటలో శరీరకంగా లోబర్చుకున్న వేణు తర్వాత పెండ్లికి నిరాకరించటంతో సునిత బుధవారం దీక్షకు దిగిన విషయం విధితమే బుధవారం రాత్రి 12 గంటల వరకు దీక్ష చేసిన సునితను కారేపల్లి పోలీసులు రక్షణ కోసం కారేపల్లి ఎస్ఎంఎస్ మహిళ వసతి గృహంలో ఉంచారు. గురువారం వసతి గృహం నుండి ప్రియుడి ఇంటికి వెళ్ళిన సునిత దీక్షను కొనసాగిస్తుంది. తనకు ప్రేమించిన యువకుడితో పెండ్లి అయ్యేంతవరకు దీక్ష సాగిస్తానని తెలిపింది. తనకు అండగా నిలవాలని పెద్దమనుషులను కోరింది. సునిత ఇంట్లో దీక్ష చేస్తుండగా వేణు కుటుంబ సభ్యులు అందరు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సునితకు న్యాయం చేయాలని ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శులు సూరబాక ధనమ్మ, కొండబోయిన ఉమావతి, పీవోడబ్ల్యూ నాయకురాలు వై.జానకీలు డిమాండ్ చేశారు. సునిత దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.