Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మించాలని ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు డీఆర్పీ శివ కోరారు. మండల పరిధిలోని మంగళగూడెం ఉన్నత పాఠశాలలో జిల్లా విద్య, వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా గురు వారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శివ మాట్లా డారు.హెచ్ఐవీ, టీబీ వ్యాధుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.హెచ్ఐవి ఉన్న వారికి టీబీ సోకె ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు విద్యార్థులు జీవన నైపుణ్యాలు పెంపొందించుకొని భావిభారత భవిష్యత్తు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగిరెడ్డి, ఎస్ఎంసీ ఛైర్మన్ దేవేంద్రమ్మ, ఉపాధ్యాయులు పంజాల ఐలయ్య, టీబీ సూపర్ వైజర్ గొడ్డుగోర్ల ఉపేందర్, రామకృష్ణ, దేవా, గురుభాయి తదితరులు పాల్గొన్నారు.