Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై ఛీఫ్ సూపరింటెండెట్లు ద్వారా ధృవీకరణ తీసుకుంటున్నామని కలెక్టర్ అనుదీప్ చెప్పారు. ఏదేని అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్య సేవలందించేందుకు అత్యవసర వాహనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న 8119 విద్యార్ధులతో పాటు 2738 వృత్తివిద్య నభ్యసిస్తున్న విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. జిల్లాలో 34 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. మారుమూల ప్రాంతాల విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరయ్యేందుకు రూటు మ్యాపులు రూపొందించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లును సంబంధిత మండలాల తహసిల్దారులు, ఎంపీడీఓల ద్వారా పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలు నిర్వహణలో 34 మంది ఛీఫ్ సూపరింటెండ్లు, 34 మంది డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు, రెవిన్యూ, పోలీస్, విద్యాశాఖాధికారులతో ఏర్పాటు చేసిన రెండు ఫ్లైయింగ్ స్యాడ్స్, మూడు సిట్టింగ్స్ స్క్వాడ్స్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. పరీక్షా కేంద్రంలో అత్యవసర చికిత్సా కేంద్రాలు ఏర్పాటుతో పాటు వైద్య సిబ్బంది విధులు నిర్వహించు విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి బి. సులోచనారాణి, డిపిఓ రమాకాంత్, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్, ఆర్టిసి డివియం శ్రీకృష్ణ, సిఐ బాలాజి, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.