Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీడియో కాన్పెరెన్స్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కొత్తగూడెం
పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సర పరీక్షలు నిర్వహణ ఏర్పాట్లుపై గురువారం రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శి ఉమర్ ఉమర్ జలీల్ జిల్లా కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా చక్కగా పరీక్షలు నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని, విద్యార్థులు 8.30 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆమె సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్సు కేంద్రాలను మూసివేయించాలని చెప్పారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ను పటిష్టంగా అమలు చేయాలని పోలీస్ అధికారులను, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను మంత్రి ఆదేశించారు.