Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గృహ యజమానులకు అండగా ఉందాం..!
అ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష, విపక్ష
జిల్లా నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో క్రమబద్దీకరణ పట్టాల జారీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం వల్ల ఇబ్బందు లు పడుతున్న గృృహ యజమానులకు అండగా ఉందామని, ఇండ్లు కూల్చడం ఆపాలని, కూల్చడం మొదలు పెడితే ఐక్య ఉద్యమాలు తప్పవని వామపక్ష, అఖిలపక్ష నేతలు స్పష్టంచేశారు. సీపీఐ జిల్లా కార్యాలయం, శేషగిరిభవన్లో గురువారం జరిగిన వామపక్ష, విపక్షాల సంయుక్త సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా మాట్లాడారు. 2005 సంవత్సరంలో జారీ అయిన జీవో ప్రకారం కొత్తగూడెం పట్టణంలోని ఇంటి స్థలాలకు క్రమబద్దీకరణ పట్టాలు జారీ చేయాల్సిన అధికారులు ఏండ్ల తరబడి జాప్యం చేస్తున్నారని, వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా చాలా మంది గృహ యజమానులు తమ స్థలాలను క్రమబద్దీకరణ దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కొత్తగూడెం పట్టణం రామవరం పరిధిలోని 6 వార్డుల్లో పట్టాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పేద, మద్యతరగతి వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రాంత ఇంటి యజమానులకు పొజేషన్ సర్టిఫికేట్లు జారీ చేయాలని కోరారు. పట్టణానికి అనుకొని చంపచుపల్లి మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో స్థల యజమానులకు వారి స్థలాలపై చట్టపరమైన హక్కు లేకపోవడంతో సొంతింటి కల నెరవేరడం లేదన్నారు. జరుగుతున్న జాప్యం తెలిసినప్పటికీ మున్సిపల్ శాఖ ఇండ్లను కూల్చివేసేందుకు పూనుకోవడం సరికాదన్నారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు, సీపీఐ(ఎం) పట్టాణ కార్యదర్శి భూక్యా రమేష్, కాంగ్రెస్ జిల్లా నాయకులు రాజేష్, వీర స్వామి, టీడీపీ నాయకులు రమణారావు, న్యూడెమోక్రసి పార్టీ నాయకులు మాచర్ల సత్యం, ఎన్.సంజీవ్, బీజేపీ జిల్లా నాయకులు లక్ష్మణ్ అగ్రవాల్ తదితరులు మాట్లాడారు. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వై.శ్రీనివాసరెడ్డి, కంచర్ల జమలయ్య, భూక్య శ్రీనివాస్, పి.సత్యనారాయణచారి, బోయిన విజరు కుమార్, నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీను, పిడుగు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు వీరస్వామి, బిజెపి నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.